ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మియాపూర్లో ఓ కారులో భారీగా బంగారం పట్టుబడింది.
27 KG Gold And 15 KG Silver: తెలంగాణ రాష్ట్రంలో ప్రలోభాల పర్వం పీక్కి చేరినట్టు ఉంది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే పనిలో నేతలు ఉన్నారు. డబ్బు, నగలు, బంగారం, చీరలు భారీగా దొరుకుతున్నాయి. షెడ్యూల్ విడుదలైన కొద్దీ రోజుల్లో ఈ స్థాయిలో పట్టుబడుతుండటం విశేషం.
షెడ్యూల్ విడుదలైన వెంటనే వాహన తనిఖీల ప్రక్రియ వేగం పెరిగింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు తావివ్వకుండా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లో భారీగా నగదు, నగలు పట్టుబడుతున్నాయి.
మియాపూర్లో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ కారులో భారీగా బంగారం పట్టుబడింది. 27.540 గ్రాముల బంగారం (27 KG Gold), 15.650 కిలోల వెండి ( 15 KG Silver) కనిపించింది. ఆభరణాలకు సంబంధించి బిల్లులు చూపించలేదు. దీంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.16.5 కోట్లుగా ఉండనుంది. వెండి రూ.11.30 లక్షలుగా ఉంది. బంగారం, వెండి ఆభరణాలను తీసుకెళ్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
కార్లు, ట్రక్, టాటా ఏస్ వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. పోలీసులు సందేహించినట్టు అందులో భారీగా నగదు, నగలు పట్టుబడుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కన్నా.. ఈ సారి పట్టుబడే నగదు విలువ భారీగా పెరిగే అవకాశం ఉంది