B-Form: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు బిజీగా ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ కొందరికీ బీ ఫామ్స్ ఇచ్చాయి. అసలు బీ ఫామ్ (B-Form) అంటే ఏంటీ..? ఎన్నికల సంఘం ఏ ఫామ్ ఎవరికీ ఇస్తోంది.
ఏ ఫామ్ అంటే..?
ఫస్ట్ ఏ పామ్ గురించి తెలుసుకుందాం.. ఓ రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన తర్వాత ఎన్నికల బరిలో దిగుతోంది. ఆ పార్టీకి ఈసీ గుర్తింపు ఇచ్చి, గుర్తు కేటాయిస్తోంది. పార్టీ అధ్యక్షుడికి ఏ ఫామ్ ఇచ్చే అధికారం ఉంటుంది. ఫలానా పార్టీ తనది, తన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కోరుతూ ఈసీకి పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తారు. దానికి ఈసీ స్పందించి.. ఆ పార్టీ అధినేతకు ఏ ఫామ్ ఇచ్చే బాధ్యతను ఇస్తోంది. సదరు అభ్యర్థి సంతకంతో బీ ఫామ్స్ జారీచేసే వీలు ఉంటుంది. అంటే బీ ఫామ్ తీసుకున్న వ్యక్తి.. పార్టీ అభ్యర్థి అవుతారు. ఆ పార్టీ గుర్తు ఈవీఎంలలో కనిపిస్తోంది.
బీ ఫామ్ అంటే..?
రాజకీయ పార్టీ అధ్యక్షుడు సంతకంతో ఏ ఫామ్ ఉంటుంది. అతని పేరు ఉంటేనే పార్టీ గుర్తింపు వస్తోంది. తర్వాత అభ్యర్థులకు జారీచేసేది బీ ఫామ్.. దీని మీద ఆ పార్టీ ఏ ఫామ్.. అంటే అధ్యక్షుడి సంతకం తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే రిటర్నింగ్ అధికారి సంబంధిత అభ్యర్థిగా గుర్తిస్తారు. లేదంటే తిరస్కరించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నామినేషన్ ఫైలింగ్ తిరస్కరణ జరుగుతుంది. ప్రముఖ నేతలు రెండు కాపీలు నామినేషన్ ఫైల్ చేస్తుంటారు. బీ ఫామ్ (B-Form) మీద అధ్యక్షుడి సంతకం, పార్టీ పేరు ఉంటే.. సదరు అభ్యర్థి ఆ పార్టీ మీద పోటీ చేస్తున్నారు. నామినేషన్ పత్రం, బీ ఫామ్ చూసి.. క్యాండెట్ సదరు పార్టీని నిర్ధారించుకుంటారు. అలా పార్టీ గుర్తింపును కేటాయిస్తారు. బీ ఫామ్ లేకుంటే పార్టీ గుర్తు కేటాయించారు. ఇండిపెండెంట్‌గా పరిగణిస్తారు.
అందుకే ఉండవు
స్థానిక ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తింపు ఉండదు. అసెంబ్లీ, లోక్ సభ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మాత్రమే పార్టీ గుర్తులు ఉంటాయి. దాంతో ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఏర్పడతాయి.
కేసీఆర్ ఏం చెప్పారంటే..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ అభ్యర్థులకు నిన్న బీ ఫామ్స్ ఇచ్చారు. ఎన్నిక ఎన్నికకు నిబంధనలు మారతాయని.. అభ్యర్థులు చూసి, నింపాలని కోరారు. తప్పులు పోవద్దని, జాగ్రత్తగా ఉండాలన్నారు. సందేహాం కలిగితే లీగల్ అడ్వైజర్‌కు ఫోన్ చేయాలని కోరారు. అంటే.. నామినేషన్ తిరస్కరణకు గురి కావొద్దని.. ఓ పార్టీ అధినేతగా కేసీఆర్ పదే పదే చెప్పడంతో.. బీ ఫామ్‌కు ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్థం అవుతోంది.