45 Year కష్టపడ్డ కాంగ్రెస్‌లో అవమానమే జరిగింది: పొన్నాల లక్ష్మయ్య
45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కష్ట పడ్డానని.. అయినా అవహేళనకు గురయ్యానని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Ponnala Laxmaiah: సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనగామలో జరుగుతోన్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వేదిక గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పొన్నాల లక్ష్మయ్యకు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో 45 ఏళ్లుగా పనిచేశానని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. చివరికీ తనకు అవమానం జరిగిందని వివరించారు. సరైన గుర్తింపు ఇవ్వలేదని తెలిపారు. ఇకపై బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో అవమానానికి, అవహేళనకు గురయ్యాను. అధికారం చేపట్టిన 3 నెలల్లో సకల జనుల సర్వే చేసిన సీఎం కేసీఆర్ అని పొన్నాల లక్ష్మయ్య వివరించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో ఈ ప్రాంత రైతులకు మేలు కలిగిందన్నారు. డైరీ డెవలప్ మెంట్ తీసుకొచ్చారని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రెండు నియోజవకర్గాల్లో 45 వేల మంది రైతులు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 వేల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని వివరించారు.