Ex Minister Malla Reddy Approached Telangana High Court
Mallareddy: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి (Mallareddy) ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీని కూడా విమర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఫేస్ వ్యాల్యూ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన ఉందని.. కాంగ్రెస్ అంటేనే స్కాములు అని గుర్తుచేశారు.
రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేసినా.. పాదయాత్ర చేసినా నో యూజ్ అంటున్నారు. మోకాళ్ల యాత్ర చేసినా ఫలితం లేదన్నారు. ఏం చేశారని జనాల్లోకి వెళతారని అడిగారు. ఎంపీగా గెలిచి.. నాలుగేళ్లపాటు రేవంత్ రెడ్డి ప్రజలకు మొహం కూడా చూపించలేదన్నారు. ఇక బీజేపీకి కూడా కౌంటర్ ఇచ్చాడు. బీజీపీ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని పేర్కొన్నారు. ఆ పార్టీకి 3, 4 సీట్లు మాత్రమే వస్తాయని వివరించారు.
ఈటల రాజేందర్‌కు ఏం చూసి ఓటేస్తారని.. ఆయనకు ఎందుకు ఓటు వేయాలని అడిగారు. హుజురాబాద్‌లో ఓడిపోతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 105 వరకు సీట్లు వస్తాయని తెలిపారు. మేడ్చల్‌లో వజ్రేష్ యాదవ్ భూ కబ్జాలు చేస్తున్నాడని.. కొన్నింటినీ తానే విడిపించానని తెలిపారు.