నిన్నటి వరకు పారదర్శకంగా పనిచేస్తుందన్న టీఎస్పీఎస్సీ బోర్డును నేడు కేటీఆర్ ప్రక్షాళన చేస్తామని అంటున్నారు. ఇది కాదా దిగుజారుడు రాజకీయాలు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆగ్రహజ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని, నిరుద్యోగ ద్రోహులుగా మీరు మిగిలిపోతారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila demanded that KTR apologize to the people of Telangana
YS Sharmila: తెలంగాణ(Telanagana)లో ఉద్యోగాల నియామకం పకడ్భంధిగా లేదని ఎన్ని సార్లు విన్నవించినా..టీఎస్పీఎస్సీ(TSPSC) పారదర్శకంగా పని చేస్తోందని కేటీఆర్(KTR) అన్నారు. ఇప్పుడేమో ప్రక్షాళన అంటున్నారు. అంటే చిన్నదొర తప్పు అంగీకరించినట్లే కదా అని వైఎస్సార్ తెలంగాణ(YSR Telangana) పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా తెలంగాణ మంత్రిపై విమర్శలు గుప్పించారు.
ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆరోజు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి.. తీరా ఇప్పుడు దాన్ని తొలగిస్తామని ఎలా మాట్లాడలనిపిస్తోందని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వమని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మాట్లాడలేదు కానీ.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని బొంకుతున్నాడని వ్యాఖ్యనించారు.
TSPSC బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించిన మీరే..పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే. ఇప్పుడు తప్పు జరిగిందని సర్వీస్ కమిషన్ ప్రక్షాళన అంటున్నది మీరేనని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్రామాలన్నీ ఎందుకు దొర? ఓట్ల కోసమే కదా! ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు నిజం. మీరు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారన్నదే వాస్తవం. ఏళ్ల తరబడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని తెలంగాణ యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల బలిదానాల మీద అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులనే నిండా ముంచిన దుర్మార్గులు మీరని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మీరు చేసిన మోసాలు చాలు. ఈ నిరుద్యోగుల ఆగ్రహజ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని రాసుకొచ్చారు. మీరు తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతరని షర్మిలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్టే కదా?…