అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ(Telangana)లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈక్రమంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అడ్డుకట్ట విస్తృత తనిఖీలు చేస్తూ ఎలాంటి పత్రాలు లేకుండా నగదు(Cash), బంగారు,వెండిని తరలిస్తున్నరు.ఎన్నికల షెడ్యూల్ వచ్చిన అక్టోబరు 9న నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.307.2కోట్లకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (Electoral Officer) ప్రకటించారు.గడచిన 24గంటల్లో రూ.9.69కోట్ల నగదు పట్టుబడగా, ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం నగదు రూ.105.58 కోట్లు. నిన్న ఉదయం నుంచి రూ.1.35లక్షల విలువైన మద్యం పట్టుబడగా.. స్వాధీనం చేసుకున్న మొత్తం సరకు విలువ రూ.13.58 కోట్లు. 24 గంటల్లో రూ.72 లక్షల విలువైన 232 కిలోల గంజాయి పట్టుబడింది.