»Shock For Kcr India Today Survey Report Congress Tweet
India Today survey: బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన ఇండియా టుడే సర్వే
ఇండియా టుడే సర్వే రిపోర్ట్ సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుందని.. గతంలో 11 శాతం ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు 39 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Shock for KCR.. India Today survey report.. Congress tweet
India Today survey: తెలంగాణ(Telangana)లో బీఆర్ఎస్(BRS) పార్టీకి కాంగ్రెస్(Congress) గట్టి పోటీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. తాజాగా ఇండియా టుడే(India Today) సర్వే కూడా అదే విషయాన్ని చెబుతుంది. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు, బీఆర్ఎస్కు 49 సీట్లు రావొచ్చునని ఇండియా టుడే – సీ వోటరు సర్వే తెలిపింది. బీజేపీ ఎనిమిది, ఇతరులు ఎనిమిది సీట్లు గెలవచ్చునని నివేదిక బహిర్గతం చేసింది. కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే 11 శాతం ఓటు బ్యాంకు పెరిగి 39 శాతానికి, బీఆర్ఎస్కు 9 శాతం తగ్గి 38 శాతానికి పడిపోతుందని, బీజేపీ ఓటు శాతం 7 శాతం నుంచి 9 శాతం పెరిగి 16 శాతానికి చేరుకుంటుందని ఈ సర్వే తెలిపింది.