Rahul Gandhi: బెబ్బులిలా కాంగ్రెస్ నేతలు.. ఇక కేసీఆర్ పరారే: జగిత్యాల సభలో రాహుల్ గాంధీ
ఓబీసీ కుల గణన ఎందుకు చేయడం లేదని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌కు వారి ఓట్లు కావాలే తప్ప.. ప్రయోజనాలు అక్కర్లేదని హాట్ కామెంట్స్ చేశారు.
Rahul Gandhi:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్నీ పార్టీల అగ్ర నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల తెలంగాణ కోరుకుంటే దొరల తెలంగాణ వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో దోపిడీ సొమ్ము అంతా బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరారు. క్వింటాల్ పసుపుకు మద్ధతు ధర రూ.15 వేలకు పెంచుతామని హామీనిచ్చారు.
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ కూడా ప్రజా రంజక పాలన చేయడం లేదని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఇద్దరు కుల రిజర్వేషన్ చేయడానికి వెనకడుగు వేశారని ధ్వజమెత్తారు. నిజమైన ఓబీసీ జాబితా రావడం మోడీ, కేసీఆర్‌కు ఇష్టం లేదన్నారు. వెనకబడిన వర్గాలను వారు ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులను 90 శాతం అగ్రవర్ణాలకే వస్తున్నాయని గుర్తుచేశారు. దేశంలో బడ్జెట్ కేటాయించేది 90 శాతం ఉన్న వారి కోసమేనని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
90 మంది ఐఏఎస్ అధికారుల్లో ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు. 5 శాతం బడ్జెట్ మాత్రమే ఓబీసీలకు కేటాయించడం జరుగుతందని వివరించారు. దేశంలో 5 శాతం మందే ఉన్నారా అని అడిగారు. 50 శాతం మంది ఉన్న వారికి బడ్జెట్, ఉద్యోగాల్లో ఎందుకు కేటాయించడం లేదన్నారు. ఈ వాస్తవాలను వెలుగులోకి మోడీ, కేసీఆర్ రానీయడం లేదని ఆరోపించారు. ప్రజలకు లభించాల్సిన హక్కులు, వనరులను మోడీ, కేసీఆర్ పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక్కడ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడేది కాదని వివరించారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడుదామని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత చేపడుతామని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన పథకాలు రూపొందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పులులు గాండ్రిస్తే.. బీఆర్ఎస్, కేసీఆర్‌ను వెనక్కి పంపిస్తోందని రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ యువత ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడబోతుందని వివరించారు. జాతీ సమైకత్యా కోసం త్యాగం చేసిన ఘనత తమ కుటుంబానికి దక్కుతుందని రాహుల్ గాంధీ వివరించారు. బీజేపీ తన పదవీని లాక్కుందని.. ఇల్లు కూడా తీసుకుందని బీజేపీపై విమర్శలు చేశారు. కానీ తనకు ప్రజల హృదయాల్లో చోటు సంపాదించానని పేర్కొన్నారు.