సుప్రీంకోర్టు(Supreme Court)లో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కారు గుర్తును పోలిన సింబల్స్ ఇతరులకు కేటాయించొద్దని వాటిని ఫ్రీ సింబల్స్ (Free symbols) జాబితా నుంచి తొలగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ఎన్నికల్లో తమ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిన రోడ్డు రోలర్ (Road roller) వంటి కారును పోలిన సింబల్స్‌ను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే గుర్తుల తొలగింపు కుదరదని ఈసీ బదులిచ్చింది.
తాజాగా ఈసీ విడుదల చేసిన గుర్తుల జాబితాలో రోడ్డు రోలర్ సహా బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతున్న గుర్తులు యధాతథంగా ఉన్నాయి.’కారుకు, రోటి మేకర్‌కు మధ్య తేడా తెలుసుకోలేనంత అమాయకులు కాదు. ఓటర్లు (Voters). వారికి అన్నీ తెలుసు’ అని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే గుర్తుల వివాదానికి సంబంధించి బీఆర్ఎస్ ఇటీవలే ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తొలి విచారణ సందర్భంగానే తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కారు గుర్తును పోలిన వాటిని తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్(Petition)ను డిస్మిస్ చేసింది.