బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా (Rajkundra) తాజాగా సంచలన ప్రకటన చేశాడు. తన అధికార ఎక్స్ ఖాతా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. అయితే కేవలం శిల్పా శెట్టి (Shilpa Shetty) గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాకుండా కేవలం మేము విడిపోయాము.. ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాల..దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అంటూ రాసుకురావడం జరిగింది.ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారుతున్నది. అయితే శిల్పా శెట్టి తన భర్త నుంచి దూరంగా డివర్స్ తీసుకుందా లేదా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
కానీ మరి కొంతమంది మాత్రం రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ (Tweet) విడాకుల గురించి కాదని ఇన్నాళ్లు తను పెట్టుకున్న మాస్క్ గురించి చెప్పాడని ఇకపై మాస్క్ ఉపయోగించానని ఇలాంటి రూపంలో తెలియజేశారు అంటూ పలువురు నెటిజన్ (Netizen) సైతం కామెంట్స్ చేస్తున్నారు. విడాకులు వ్యవహారంపై శిల్పా శెట్టి కూడా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటన చేయలేదని అభిమానులు తెలుపుతున్నారు. పోర్నోగ్రాఫీ కేసులో గతేడాది నవంబర్‌లో అరెస్టు తరువాత రాజ్‌కుంద్రా బెయిల్(Bail)పై విడుదలైన విషయం తెలిసిందే. నాటి నుంచి అతడు మాస్కు పెట్టుకునే మీడియా ముందుకు రావడం మొదలెట్టాడు. అయితే, త్వరలో తన సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో బుధవారమే రాజ్ కుంద్రా ఈ ధోరణికి స్వస్థి పలికాడు.
మాస్కు లేకుండా తొలిసారి మీడియా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా, రాజ్ కుంద్రా జీవితంలోని కాంట్రవర్సీలే నేపథ్యంగా రూపొందిన ‘యూటీ 69’ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది.శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా 2009లో వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాజ్ కుంద్రా తన బయోపిక్ (Biopic) తెరకెక్కించడం జరిగింది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇందులో నీలి చిత్రాల కేసులో తన జైలు జీవితం గడపడం గురించి కూడా మాట్లాడారు.. అలా జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన ముఖాన్ని చూపించకుండా మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ లాంచ్ వేడుకలలో ఆ మాస్కుని తొలగించినట్టు తెలుస్తోంది.. మరి నిజంగానే విడాకుల వ్యవహారమా లేకపోతే మాస్క్ గురించ అన్న విషయం తెలియాల్సి ఉంది.