సీఎం కేసీఆర్ (CMKCR) ఇటీవల చేసిన పలు కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ‘మీరు ఒడగొట్టిండ్రనుకో.. ఏమున్నది.. పోయి రెస్టు తీసుకుంటం.. అంతే కదా.. మాకు వచ్చేదేమీ లేదు.. పోయేదేమీ లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.. కానీ నష్టపోయేది మాత్రం ప్రజలే అని.. చెప్పడం మా బాధ్యత.. ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే’ అని అచ్చంపేట(Atchampeta)లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ప్రసంగించే కేసీఆర్ ఈసారి మాత్రం ఓటర్లను ప్రాధేయపడే తీరులో రిక్వెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఓడిపోతామని కేసీఆర్ ముందే అర్థమైందా..ఒక అంచనాకు వచ్చారా? ఓటర్లను ఆకర్షించడం కోసమే వ్యూహాత్మకంగా ఈ కామెంట్లు చేస్తున్నారా?.. గెలిపించకుంటే పథకాలు అందవని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారా?.. ఇలా పలు రకాల చర్చలు నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో సారు.. కారు.. నూరు.. సర్కారు.. స్లోగన్‌తో పూర్తి ధీమాతో ఉన్న కేసీఆర్ డిఫరెంట్ స్టాండ్ తీసుకోవడం పలు అభిప్రాయాలకు దారితీసింది.నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ప్రజాశీర్వాద సభ (Prajasirvada sabha)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణను ఓ రాష్ట్రంలా చూడాలని 24 ఏళ్ల కిందట ప్రస్థానం ఆరంభించానని వెల్లడించారు.
కొంతమంది ఇప్పుడొచ్చి కేసీఆర్ కు దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారని.. కొడంగల్(Kodangal)కు రా, గాంధీభవన్ కు రా అని సవాళ్లు విసురుతున్నారని అన్నారు. కేసీఆర్ దమ్మేంటో ప్రపంచం మొత్తానికి తెలుసని అన్నారు. రాజకీయం అంటే ఇలాంటి సవాళ్లు మాత్రమేనా? అని ప్రశ్నించారు.ఎన్నికల సమయంలో ప్రజలు ఆగం కావొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. వాళ్లూ వీళ్లూ చెప్పారని ఓటేయొద్దని, ఎవరివల్ల తెలంగాణ (Telangana) బాగుపడిందో చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.