మేషం
మీరు చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వృథా ఖర్చులు ఉన్నాయి.ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.
వృషభం
మీ మీ రంగాల్లో ఫలితాలు అనుకూలంగా వెలువడతాయి. మిత్రుల నుంచి శుభ వార్తాలు అందుకొంటారు.ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు.స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి.
మిథునం
శుభవార్త వింటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.రుణప్రయత్నం ఫలిస్తుంది. క్షణికావేశం పనికిరాదు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్యబాధలు అధికమవుతాయి.
కర్కాటకం
ఆకస్మిక ధనలాభం పొందుతారు. విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.
సింహం
కుటుంబలో ఏర్పడిన సమస్యల నుంచి బయటపడాతారు.బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు చేసేపనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు.
కన్య
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.కళాకారులు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.
తుల
మీరు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వాటిని సమర్థంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు.
వృశ్చికం
ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు.
ధనుస్సు
మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.
మకరం
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు.నూతన పనులను ప్రారంభిస్తారు.పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు శుభప్రదం.
కుంభం
వివాదలకు సాధ్యమైనంత వరుకు దూరంగా ఉండండి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.
మీనం
ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు.