సీఎం పోటో శిలాఫలకంపై లేకపోవడంతో స్పీకర్ తమ్మినేని (Speaker Tammineni) సీతారాం ఆర్అండ్బీ అధికారులపై మండిపడ్డారు.ముఖ్యమంత్రి చిత్రం శిలాఫలకంపై వేయడానికి మీకేమైనా నామోషీనా?.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ఆయన చిత్రం లేకుండా శంకుస్థాపన ఎలా చెయ్యమంటారు?.. ఇకనైనా పనితీరు మార్చుకోండి.. ప్రొటోకాల్ (Protocol) పాటించడం నేర్చుకోండి’ అంటూ స్పీకర్ తమ్మినేని విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) సరుబుజ్జిలి మండల కేంద్రంలోని సరుబుజ్జిలి-కొమనాపల్లి రహదారి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన ఆయన అక్కడి శిలాఫలకంపై సీఎం జగన్ చిత్రం లేకపోవడం చూసి పైవిధంగా వారిపై విరుచుకుపడ్డారు. శంకుస్థాపన చేయకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు.