Ponnalaకు రాహుల్ గాంధీ ఫోన్.. ఢిల్లీ రావాలని కబురు..?
బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తిరిగి పార్టీలో చేరాలని.. ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని కలువాలని కోరారని విశ్వసనీయంగా తెలిసింది.
Ponnala Lakshmaiah: తెలంగాణ గట్టు మీద రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రచార పర్వంలో నేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. పొత్తుల ఎత్తులు- గెలుపు ఓటముల అంచనా నేపథ్యంలో.. ఇప్పటికీ కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరికీ లోక్ సభ.. లేదంటే నామినెటేడ్ పదవులను ఆశ చూపిస్తున్నారు. కాంగ్రెస్లో తనకు సరైన గౌరవం లభించడం లేదని ఇటీవల పార్టీని వీడిన పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah).. బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పొన్నాల లక్ష్మ య్య (Ponnala Lakshmaiah) గత 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. టికెట్ ఇవ్వకపోవడం.. ఢిల్లీలో అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో విసుగుచెంది బీఆర్ఎస్లో చేరారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని కాంగ్రెస్ అనుకుంటోంది. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి పొన్నాల లక్ష్మయ్యకు ఫోన్ వచ్చింది. తిరిగి పార్టీలోకి రావాలని కోరినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని కులవాలని కోరిందని సమాచారం.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. ఆ వెంటనే కాంగ్రెస్ నుంచి రియాక్షన్ వచ్చింది. దీంతో పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ వెళతారా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వెళితే మాత్రం తిరిగి పార్టీలోకి చేరాలనే ఉద్దేశంతో వెళ్లినట్టు ఉంటుంది. లేదంటే.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి.. నామినేటెడ్ పదవీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదీ ఏమైనప్పటికీ.. ఎన్నికల వేళ.. ఏ ఒక్క నేతను వదులుకోవద్దని కాంగ్రెస్ అనుకుని ఉంటుంది. పొన్నాల విషయంలో మాత్రం అది ఆలస్యమైంది.