BJP Mla Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సున్నితమైన అంశంపై వీడియో చేయడంతో అప్పట్లో దుమారం చెలరేగగా సస్పెన్షన్కు గురయ్యారు. ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేసి.. టికెట్ కేటాయించారు. తన నియోజకవర్గంలో ప్రచార పర్వాన్ని మరింత స్పీడప్ చేశారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారానికి వస్తారని చెప్పారు. తనతో కలిసి ఆయన ప్రచారం చేసే సమయంలో హత్య చేస్తామని తనకు బెదిరింపులు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. గత కొన్నిరోజుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ప్రచారాన్ని అస్త్రంగా వాడుకుంటారని గుర్తుచేశారు. తమను నరుకుతాం అని కాల్స్ చేస్తున్నారని.. ఇదివరకు కూడా ఇలాగే తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని గుర్తుచేశారు. అప్పట్లో రాజా సింగ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు బెదిరింపుల పర్వం గురించి తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజా సింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన బై పోల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలిచారు. మరి ఈ సారి ఎన్ని సీట్లు గెలుస్తుందో చూడాలీ మరీ.