బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ (Congress)లో చేరే అవకాశం ఉంది. మునుగోడు లేదా ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గతంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. రాజీనామా చేసి బీజేపీ(BJP)లో చేరారు. ఉపఎన్నికలో ఓడిపోయారు. నిన్న భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలోనూ ఆయన పేరు లేకపోవడం గమనార్హం.రాజగోపాల్ రెడ్డి ఈ నెల 27న ఢిలీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ చేరే అవకాశం ఉందని, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.
గతంలో మనుగోడు (Munugodu) కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా అంత యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు జరిపిన రాజగోపాల్‌రెడ్డికి ఆ పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. ఎల్బీనగర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఆఫర్ ఉందని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నిక(Assembly election)ల్లో పోటీపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.