»Revanth Reddy Compliant The Ec To Remove The Retired Officers Immediately In Telangana
Revanth Reddy: నవంబర్ 2లోగా అన్ని పథకాల నగదు బదిలీ చేయాలి
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఈసీకి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దీంతోపాటు అధికార పార్టీ నిబంధనలకు విరుద్ధంగా నియమించిన రిటైర్డ్ అధికారులను కూడా తొలగించాలని కోరినట్లు చెప్పారు.
Revanth Reddy compliant the EC to remove the retired officers immediately in telangana
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ చాలా మంది రిటైర్డ్ అధికారులను కీలక పదవుల్లో నియమించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. అలా నియమించిన వారిని వెంటనే తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆ క్రమంలో 12 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయిన అధికారికి కూడా మళ్లీ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. రిటైర్డ్ అధికారులు కేసీఆర్ కు ప్రైవేటు ఆర్మీ మాదిరిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. దీంతోపాటు అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలని ఈసీని కోరినట్లు చెప్పారు.
అంతేకాదు రాష్ట్రంలో కేసీఆర్(KCR) ఏది చెప్పినా కూడా సరిగ్గా అమలు చేయడం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. నవంబర్ 2లోగా అన్ని పథకాల నగదు బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలకు ఇచ్చే డబ్బు ఎన్నికలకు ముందే బదిలీ చేయాలని గుర్తు చేశారు. అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ఆపేందుకు ప్రయత్నిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. మేడిగడ్డ ఘటన సంఘవిద్రోహ శక్తుల వల్ల జరిగిందని బీఆర్ఎస్(BRS) దుష్ప్రచారం చేస్తుందన్నారు. పార్టీ ఫండ్ ఇచ్చే కంట్రాక్టర్లకే అధికార పార్టీ నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని కాపాండేందుకు కేంద్రం పనిచేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఈసీ(EC)కి తెలిపామని వెల్లడించారు.