CM KCRపై బీజేపీ చర్యలు తీసుకోలే.. అందుకే సొంతగూటికి: రాజగోపాల్ రెడ్డి
తనకు నచ్చకున్న.. సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ చర్యలు తీసుకుంటుందని భావించానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అందుకే బీజేపీలో చేరానని.. కానీ తాను అనుకున్న లక్ష్యం నెరవేరలేదని స్పష్టంచేశారు.
Rajagopal Reddy: తనకు రాజకీయ జన్మను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అలాంటి పార్టీని వీడేందుకు బలమైన కారణం ఉందన్నారు. సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్రంలో ఉన్న బీజేపీ చర్యలు తీసుకుంటుందని భావించానని వివరించారు. కానీ తాను ఆశించింది జరగలేదని.. అందుకే సొంత గూటికి చేరానని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఏపీలో కాంగ్రెస్ ఖతం అయ్యిందని.. తెలంగాణలో కూడా అధికారం దక్కలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో అధికారం రాకపోవడానికి కారణం నాయకత్వ లేమి అని సెటైర్లు వేశారు.
అవినీతి
తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల నుంచి అవినీతి జరిగిందని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుందని అంతా అనుకున్నారని.. కానీ కాలేదన్నారు. బీఆర్ఎస్కు బుద్ది చెప్పాలని అనుకున్నామని పేర్కొన్నారు. బీజేపీలో తనకు ఆశించిన గౌరవం ఉందని.. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తనకు విలువ ఇచ్చారని వివరించారు. మోడీ నాయకత్వం మీద నమ్మకంతో ఉన్నానని.. అయినప్పటికీ దుర్మార్గమైన సీఎం కేసీఆర్ను గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలిపారు.
రాచరిక పాలన
తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు.. కుటుంబ పాలన ఉందని ప్రజలు ఫీలయ్యారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నానరు. ఇంత జరుగుతోన్న కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. అందుకే తనకు సందేహాం కలిగిందని.. పార్టీ మారొద్దని అనుకున్నానని.. కానీ కేసీఆర్ను గద్దె దింపేందు కోసం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీతో నీతిమంత పాలన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితుడిని సీఎం చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని గుర్తుచేశారు.
నిస్వార్థంగా పోరాటం
తెలంగాణ కోసం నిస్వార్థంగా పోరాటం చేశాం అన్నారు. కాంట్రాక్ట్ కోసం బీజేపీకి వెళ్లానని ఆరోపించిన నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని పేర్కొన్నారు. మునుగోడు బై పోల్లో ఓడిపోయినా.. వందల కోట్లతో నిధులు వచ్చి, అభివృద్ధి జరుగుతోందన్నారు. తన రాజీనామాతో మునుగోడు కాళ్ల వద్దకు అసెంబ్లీ వచ్చిందని గుర్తుచేశారు. మునుగోడు నుంచి పోటీ చేస్తానని స్పష్టంచేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయనని.. కొందరు కోరినా మాట వాస్తవమేనని అంగీకరించారు.
గజ్వేల్లో పోటీ..?
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే గజ్వేల్లో కేసీఆర్పై బరిలోకి దిగుతానని తెలిపారు. గజ్వేల్లో రిటర్న్ గిప్ట్ ఇస్తానని చెబుతున్నారు. తప్పుడు నిర్ణయాలతో బీజేపీ బలహీన పడిందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.