»Telangana Election 2023 Brs K Kavitha Says This Time Bjp Security Deposit On All Seats Will Be Forfeited
Telangana Election:’గత ఎలక్షన్లలో 105 సీట్లలో డిపాజిట్లు గల్లంతు, ఈసారి…’ అంటూ బీజేపీపై కవిత దాడి
తెలంగాణలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె.. కే కవిత బీజేపీపై విరుచుకుపడ్డారు.
Telangana Election: తెలంగాణలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె.. కే కవిత బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈసారి తెలంగాణలో బీజేపీకి అన్ని సీట్లలో డిపాజిట్ కూడా రాదన్నారు. ఆదివారం (అక్టోబర్ 22) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన తరుణంలో కె కవిత ఈ వ్యాఖ్య చేశారు. తెలంగాణలో బీజేపీ తొలి జాబితాలో 52 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ముగ్గురు ఎంపీలకు కూడా టిక్కెట్లు ఇవ్వగా, 12 మంది మహిళలను బరిలోకి దింపింది.
మహారాష్ట్రలోని షోలాపూర్లో BRS నాయకురాలు K కవిత ఆదివారం (అక్టోబర్ 22) మాట్లాడుతూ, “గతసారి తెలంగాణలో 105 చోట్ల బీజేపీ డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈసారి అన్ని సీట్లపై సెక్యూరిటీ డిపాజిట్ జప్తు అవుతుంది. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు. అందుకే ఎన్నికల కోసం ఎంత వ్యూహం వేసినా ప్రయోజనం ఉండదు…” అంటూ ఎద్దేవా చేశారు. ఈ సారి కూడా కేసీఆర్ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతారన్నారు.
Solapur, Maharashtra | BRS MLC K Kavitha says, “Last time, BJP’s deposit was confiscated at 105 places in Telangana. This time the security deposit on all seats will be forfeited. There is no place for BJP in Telangana. So no matter how many strategies they make for the… pic.twitter.com/45YeBDUCOL