»So Far Congress Has Won 21 Seats And Rs 7 Seats Won In Telangana Assembly Election 2023
Telangana assembly election 2023: ఇప్పటివరకు కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 9 చోట్ల గెలుపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పలితాలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించింది. అయితే మిగతా పార్టీలు ఎన్ని సీట్లు గెలిచాయో ఇక్కడ చుద్దాం.
So far Congress has won 21 seats and RS 7 seats won in telangana assembly election 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(telangana assembly election 2023) ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. పలు చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా గెలుపు ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు కాంగ్రెస్(congress) పార్టీ 22 నియోజకవర్గాల్లో విజయం సాధించగా..బీఆర్ఎస్(BRS) పార్టీ 9 చోట్ల గెలుపొందింది. ఇక బీజేపీ(BJP) 5 చోట్ల గెలుపొందింది. మరోవైపు ఎంఐఎం(AIMIM) పార్టీ సైతం మూడు చోట్ల గెలిపొందింది. ఈ క్రమంలో 119 మంది సభ్యుల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతోంది.
ములుగు(mulugu)లో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క, వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, చెన్నూర్ లో వివేక్, కొడంగల్ సెగ్మెంట్లో రేవంత్ రెడ్డి, పాలకుర్తి, తుంగతుర్తి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డి తనయుడు జయవీర్‌రెడ్డి(కాంగ్రెస్), బెల్లంపల్లిలో వినోద్(కాంగ్రెస్), నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి(కాంగ్రెస్) సహా అనేక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మరోవైపు మేడ్చల్‌లో మల్లారెడ్డి తొమ్మిది వేల ఓట్ల తేడాతో గెలవగా.. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి కోటా నీలిమపై గెలుపొందారు. ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ 42, బీఆర్ఎస్ 31, బీజేపీ 3, ఎంఐఎం 3, ఇతరులు ఒక సెగ్మెంట్లో ఆధిక్యంలో ఉన్నారు.