»Brs Legal Cell Complained To Election Officer Vikas Raj Against Revanth Reddy
Revanth Reddy: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ లీగల్ సెల్ ఫిర్యాదు
బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో సమావేశమయ్యారు. సైలెంట్ గా ఉండాల్సిన సమయాన్ని హింసాత్మకంగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు.
Revanth Reddy : బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో సమావేశమయ్యారు. సైలెంట్ గా ఉండాల్సిన సమయాన్ని హింసాత్మకంగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమ భరత్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజకీయ నాయకులు మౌనంగా ఉండాలని చట్టం ఉంది. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను కాంగ్రెస్ నేతలు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. టీపీసీసీ రేవంత్ వ్యాఖ్యలు ఓటర్లను ప్రలోభపెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వ్యాఖ్యలు చేస్తున్నారని భరత్ అన్నారు.
సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై సీఈవో, ఈసీకి ఫిర్యాదు చేశాం.. ఏ1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కేటీఆర్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కేటీఆర్ పేరుతో తప్పుడు ప్రచారం చేయబోతున్నారని డీజీపీకి ముందుగానే ఫిర్యాదు చేశాం. . అలా చేసిన గంటలోపే ఫేక్ వీడియో బయటకు వచ్చిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమ భరత్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో నేరాలు చేసే నాయకులు చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డికి తెలిసే ఫేక్ వీడియోలు బయటకు వచ్చాయని ఆరోపించారు.