»Polling Percentage In Popular Constituency In Telangana
TS Elections: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
తెలంగాణలోని పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరి కాస్త సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ గడువు ముగిసింది.
TS Elections: తెలంగాణలోని పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరి కాస్త సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ గడువు ముగిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌కు సమయం కేటాయించారు. 4 గంటలకు ఏజెన్సీలోని పోలింగ్ బూత్‌లను క్లోజ్ చేశారు. లైన్లో నిల్చుకున్న వారు మాత్రమే ఓటు వేయడానికి అర్హులని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 శాతానికి పైగా పోలింగ్ అయినట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 70 శాతం పోలింగ్ జరిగింది. అలాగే అత్యల్పంగా హైదరాబాద్‌లో 31. 17 శాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 60 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.