కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా (Amit Shah) రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 27న తెలంగాణలో పర్యటించనున్నారు. సూర్యాపేట(Suryapet)లో నిర్వహించునున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.ఈ పర్యటన సందర్భంగా అసంతృప్తి నేతలతో అమిత్షా విడి విడిగా సమావేశం అవుతారని తెలుస్తోంది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ(Telangana)లో పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ మినహా మిగతా పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించనప్పటికీ ప్రచారం ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress), బీజేపీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు.అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. బీజేపీ (BJP) ఇప్పటికే దాదాపు సగం సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో రెండో జాబితా రానుంది. మొదటి జాబితాలో తమ పేర్లు లేని కొంతమంది ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరితో అమిత్ షా (Amit Shah) భేటీ అయి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసంతృప్త నేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు.