NGKL: బిజినేపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ క్రిమి సంహారక మండల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో సేల్స్ రిజిస్టర్ను తనిఖీ చేసి, స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియాను వ్యవసాయ సాగుకు మాత్రమే వినియోగించాలని సూచించారు. ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.