కృష్ణా: ఉంగుటూరు(M) పొట్టిపాడు PACS అధ్యక్షుడిగా అట్లూరి జోషి మధు బాధ్యతలు స్వీకరించారు. పర్సన్లుగా నిమ్మకూరి మాణిక్యాలరావు, చొప్పర శ్రీరామ తలసీ నియమితులయ్యారు. గురువారం CEO షేక్ ఖాలీషా ప్రమాణ స్వీకారం చేయించగా, నియామక పత్రాలను TDP నేత కాసర్నేని రాజా అందజేశారు. ఈ సందర్భంగా రైతులకు అందుబాటులో ఉండి ఎరువులు, రుణాలు, ధాన్యం కొనుగోలు, నగదు చెల్లింపులలో సహకరిస్తామన్నారు.