ASF: వాంకిడి మండలం జైత్ పూర్ గ్రామంలో అడా ప్రాజెక్టు నీటి ప్రవాహంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ని కలిసి ఎకరానికి 50వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించి అధికారుల ద్వారా సర్వే నిర్వహించి నష్టపోయిన వారికి పరిహారం అందేలా ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు.