VZM: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్డి పావని రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు ఎం. భాస్కరరావు, బీజేపీ నేతలు దొగ్గ దేవుడునాయుడు తదితరులు పావనీకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పావని తెలిపారు.