HNK: భీమదేవరపల్లి (మం) వంగరలోని 30 పడకల ఆసుపత్రి శిథిలావస్థలో ఉంది. 1988లో అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో రోగులు బిక్కుబిక్కుమంటున్నారు. గత రెండేళ్ల నుంచి ఎక్స్ రే మిషన్ పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పలుమార్లు అధికారులు పరిశీలించి నివేదిక పంపిన ప్రారంభం కాకపోవడం గమనార్హం.