»Etala Rajender Boora Narsaiah Goud And Vivek Venkataswamy React To Rajagopal Reddys Resignation From Bjp
Rajagopal Reddy ఆత్మ కాంగ్రెస్‌లోనే ఉండేది, ఇప్పుడు అది రుజువు అయ్యింది: బీజేపీ నేతలు
నిన్నటి వరకు బీజేపీనే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీలోని కీలక నేతలు తాజా పరిణామంపై స్పందించారు.
Etala Rajender, Boora Narsaiah Goud and Vivek Venkataswamy react to Rajagopal Reddy's resignation from BJP
Rajagopal Reddy: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) బీజేపీ(BJP)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ కీలక నేతలు స్పందిస్తున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud), హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender), మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి(Vivek Venkataswamy) మాట్లాడారు. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నయం అన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మాట ఎలా మార్చారని ఈటల రాజేందర్ అడిగారు. రాజీనామా లేఖను తాను ఇంకా చూడలేదన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం డబ్బు సంచులను మాత్రమే నమ్ముకుందని, వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. హుజూరాబాద్, గజ్వేల్ రెండు నియోజకవర్గాల్లో గెలిచి చూపిస్తా అని అన్నారు.
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన శరీరం మాత్రం పార్టీలో ఉందని, ఆత్మ కాంగ్రెస్ పార్టీలోనే ఉందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ దెప్పిపొడిచారు. బీజేపీకి రాజీనామా చేయడం బ్రేకింగ్ న్యూస్ కాదని, అందరూ ఊహించిందే అన్నారు. రాజగోపాల్ రెడ్డి చెప్పినంత మాత్రాన బీఆర్ఎస్కు తమ పార్టీ ప్రత్యామ్నాయం కాకుండా పోదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి పంపించివేయాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూస్తున్నారని తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ చేస్తానని బూర నర్సయ్య గౌడ్ స్పష్టంచేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారం తప్పని మాజీ ఎంపీ వివేక్ వెంకట్‌స్వామి తెలిపారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. తాను పెద్దపల్లి నియోజికవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.