BRS MLA KP Vivekanand: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో ఓటర్లను అట్రాక్ట్ చేసే పనిలో నేతలు ఉన్నారు. ప్రజల వద్దకు స్వయంగా వెళుతున్నారు. మరికొందరు టీవీ డిటేట్లలో పాల్గొంటున్నారు. తెలుగులో ఓ ప్రముఖ మీడియా సంస్థ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఓపెన్ లైవ్ డిబేట్ నిర్వహించింది. ఆ క్రమంలో భూ కబ్జాల గురించి గొడవ ఘర్షణకు దారితీసింది.
భూ కబ్జాలపై డిస్కషన్
బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekanand), బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ (kuna srisailam goud), కాంగ్రెస్ నుంచి కొలన్ హన్మంత్ రెడ్డి (kolan hanmanth Reddy) పాల్గొన్నారు. డిస్కషన్ స్టార్ట్ కాగా ఎమ్మెల్యే వివేకానంద్ (KP Vivekanand) గత తొమ్మిదిన్నర ఏళ్లలో చేసిన పని గురించి వివరించారు. మధ్యలో శ్రీశైలం గౌడ్ అడ్డుకున్నారు. ఇన్ ఫుట్ ఎడిటర్ కలుగజేసుకొని పరిస్థితిని సద్దుమణిచేలా చేశారు. అయినప్పటికీ నో యూజ్.. మళ్లీ మాటల యుద్ధం జరిగింది. 2009 నుంచి కూన శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యేగా అయిదేళ్ళపాటు చేశారని, తర్వాత ప్రజలు ఆయనకు డిపాజిట్ కూడా ఇవ్వలేదని వివేక్ అన్నారు. పని చేస్తే ఎందుకు గెలిపించలేదని ప్రశ్నించారు. దీనిపై కూన శ్రీశైలం గౌడ్ స్పందిస్తూ… తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వ్యక్తిని అని, ఓ పార్టీ గుర్తు లేకుండా ఇండిపెండెంట్‌గా గెలిచానని, కానీ వివేకానంద టీడీపీ నుంచి గెలిచి రూ.10 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. తర్వాత ఒకరిపై మరొకరు భూకబ్జాదారు అని ఆరోపణలు గుప్పించుకున్నారు.
ఎమ్మెల్యే అనుచరులు
భూ కబ్జాల గురించి ఇన్ ఫుట్ ఎడిటర్ అడగగా అదేం లేదని.. చేయలేదని వివేకానంద్ చెప్పారు. తన వెంట కబ్జాదారులు లేరన్నారు. నీ వెంట ఉన్నారని శ్రీశైలం గౌడ్ అన్నారు. దీంతో వివేకానంద్ నువ్వు కబ్జాదారునివి అన్నారు. దానికి కౌంటర్‌గా నువ్వు, నీ నాన్న (అయ్యా) కబ్జా చేశారని శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. దీంతో కోపంతో ఊగిపోయిన వివేకానంద.. శ్రీశైలం గౌడ్ వద్దకు వచ్చి, నెట్టేశారు. తర్వాత శ్రీశైలం గొంతు పట్టుకున్నారు. ఇంతలో వేదిక పైకి ఇన్ ఫుట్ ఎడిటర్, పోలీసులు వచ్చారు. వద్దు.. వద్దు ఇది పద్ధతి కాదని చెప్పారు. అప్పటికే బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఎమ్మెల్యేదే తప్పు..?
స్టేజీ మీద ఉన్న ఇద్దరు నేతలను చెరో వైపునకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వివేక్ దూసుకొస్తుండగా.. ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే అని ఇన్ ఫుట్ ఎడిటర్ అన్నది వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఆ గొడవతో గంటన్నర పాటు జరగాల్సిన డిస్కషన్ కాసేపటికే వాయిదా పడింది. గొడవను సద్దుమణిగేలా చేయడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
కేపీ వర్సెస్ కూన
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఫస్ట్ టైమ్ ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కూన శ్రీశైలం గౌడ్ గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి కేపీ వివేకానంద్ విజయం సాధించారు. ఆ వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి గెలుపొందారు. మూడుసార్లు గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలు (ఇద్దరు) గెలిచారు. ఇప్పుడు కూడా కేపీ వివేకానంద, శ్రీశైలం గౌడ్ మధ్య గట్టి పోటీ ఉండనుంది.