Google Maps: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్… ఇక వాట్సప్‌తో పనిలేదు
గూగుల్ మ్యాప్స్‌తో లొకేషన్లు గుర్తించడం, ఇతరులకు పంపించడంతో పాటు షార్ట్ కట్ రూట్, లైవ్ లోకేషన్ కూడా పంపిస్తాము. అయితే వాటిని పంపించాలంటే కచ్చితంగా వాట్సప్ ఉండాల్సిందే. తాజా ఫీచర్‌తో డైరెక్ట్‌గా లొకేషన్ పంపొచ్చు.
Google Maps: గూగుల్ మ్యాప్స్(Google Maps) ఎంత ఉపయోగపడుతున్నాయో అందరికీ తెలిసిందే. కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినా, రూట్ తెలుసుకోవలన్నా, షార్ట్‌కట్ మార్గాలతో ప్రయాణించాలన్నా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వీటితో పాటు రియల్‌టైమ్ లొకేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి సదుపాయాలన్ని గూగుల్ మ్యాప్స్ అందిస్తోంది. అయితే ఈ రియల్‌టైమ్ లొకేషన్‌ను వేరే వాళ్లకు పంపించాలంటే కచ్చితంగా వాట్సాప్‌తో పంపిస్తాము. తాజా గూగుల్ మ్యాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఏ యాప్స్‌తో పనిలేకుండా కేవలం సాధారణ మెసేజ్ ద్వారానే రియల్‌టైమ్ లొకేషన్ పంపొచ్చు. వాట్సాప్ ద్వారా లైవ్ లొకేషన్(Live Location) పంపే సదుపాయం ఉన్నప్పటికీ 15 నిమిషాలు, గంట, 8 గంటలు ఇలా లిమిటెడ్ ఆప్షన్లు ఉంటాయి. ఈ కొత్త ఫీచర్‌తో లొకేషన్‌కు లిమిట్ ఉండదు. ఎంత టైమ్ అయినా ఆన్‌లోనే ఉంటుంది. మనం వద్దనుకున్నప్పుడే ఆపొచ్చు. అయితే ఈ ఫీచర్‌ని వినియోగించాలంటే మీరు లొకేషన్ పంపాలనుకున్న వ్యక్తి కూడా గూగుల్ మ్యాప్స్ యాప్‌లో లాగిన్ అయ్యిండాలి.