Kerala : గూగుల్ ను గుడ్డిగా నమ్మారు.. కారు తీసుకెళ్లి నదిలో తోశారు
ఇటీవల కాలంలో తెలియని ప్రదేశానికి వెళ్లడానికి చాలామంది గూగుల్ మ్యాప్ పై ఆధారపడుతున్నారు. కొన్ని సార్లు అలా గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మడం వల్ల అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారు. కేరళలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Kerala : ఇటీవల కాలంలో తెలియని ప్రదేశానికి వెళ్లడానికి చాలామంది గూగుల్ మ్యాప్ పై ఆధారపడుతున్నారు. కొన్ని సార్లు అలా గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మడం వల్ల అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారు. కేరళలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దక్షిణ కేరళ జిల్లాలోని కురుప్పంతర సమీపంలో ఒక ప్రదేశం నుంచి మరో చోటికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించడం వల్ల జరిగిన ప్రమాదం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి కేరళను సందర్శించేందుకు వచ్చిన ఓ పర్యాటక బృందం వాహనంతోపాటు నీటిలో మునిగింది. పర్యాటకులను రక్షించామని, అయితే వారి వాహనం నీటిలో మునిగిపోయిందని పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి ఓ మహిళతో సహా నలుగురు సభ్యుల బృందం అలప్పుజ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
తాము ప్రయాణించే రోడ్డుపై భారీ వర్షం కురియడంతో డ్రైనేజీ నీరు చేరిందని బృందంలోని వారు తెలిపారు. పర్యాటకులకు ఈ ప్రదేశం తెలియకపోవటం వల్ల రోడ్లపై అవగాహన లేకపోవడంతో గూగుల్ మ్యాప్స్‌తో ప్రయాణం చేస్తూ వాహనంతో పాటు లోతైన నీటిలోకి వెళ్లిపోయారు. వాహనాన్ని లోతుగా నీటిలోకి తీసుకెళ్తున్నట్లు తనకు అర్థం కావడం లేదని, అది నీళ్లతో నిండిన రహదారి మాత్రమేనని డ్రైవర్ చెప్పాడు. భారీ వర్షం కారణంగా కేవలం 10 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేసినట్లు డ్రైవర్ చెప్పాడు. కారు మునిగిపోతోందని తెలియగానే భయపడి కారు కిటికీలోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పాడు.
సమీపంలోని పోలీసు పెట్రోలింగ్ యూనిట్ .. స్థానిక నివాసితుల ప్రయత్నాల కారణంగా పర్యాటకులు రక్షించబడ్డారు. అయితే వారి వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కడుతురుతి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కేరళలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అక్టోబర్‌లో ఇద్దరు యువ వైద్యులు కారు ప్రమాదంలో మరణించారు. ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడం వల్ల కారు నదిలో పడిపోయింది.