ఇటీవల గూగుల్ మ్యాపు(google maps)ను నమ్ముకుని ఏకంగా ఓ కారు చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన మరువక ముందే తాజాగా మరోకటి చోటుచేసుకుంది. ఈసారి ఏకంగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి(software employee) గూగుల్ మ్యాప్ కారణంగా ప్రమాదానికి గురై మృత్యువాత చెందాడు. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్లో(hyderabad) శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళితే ఓ ఐటీ కంపెనీ(it company)లో పనిచేసే 22 ఏళ్ల ఉద్యోగి చరణ్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ నగరంలో పర్యటించారు. ఆ క్రమంలో శనివారం సాయంత్రం తొమ్మిది మంది కలిసి 3 బైక్ లపై పర్యటించారు. ఆ క్రమంలో కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ వంటి ప్రాంతాల్లో చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లాలని అనుకుని బయలుదేరారు. అయితే వారు నగరానికి కొత్త కావడంతో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా అడ్రస్ పెట్టుకుని బైక్ పై బయలు దేరారు.
ఆ నేపథ్యంలో మెహదీపట్నం నుంచి కేబుల్ బ్రిడ్జ్ వద్దకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ మార్గం వద్ద తప్పు రూట్ అని అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా..82వ పిల్లర్ దగ్గర ఎక్స్ ప్రైస్ వే నుంచి ర్యాంప్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఆరంఘర్ వైపు నుంచి వస్తున్న కారు(car) వారి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపైన ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందపడ్డారు. ఆ క్రమంలో ఇద్దరికి గాయాలు కాగా..ఓ యువకుడు మాత్రం మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.