»Google Which Showed The Wrong Location The Court Imposed A Huge Fine
Google: లొకేషన్ తప్పుగా చూపిన గూగుల్.. భారీ జరిమానా విధించిన కోర్టు
గూగుల్ లొకేషన్ తప్పుగా చూపినందుకు ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ జరిపిన కోర్టు గూగుల్ సంస్థకు రూ.7000 కోట్లకు పైగా జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.
ఇప్పుడు అందరూ గూగుల్ మీద ఆధారపడి బతుకుతున్నారు. మనకు కావాల్సినవన్నీ గూగుల్‌లో దొరుకుతున్నాయి. అయితే ఇక్కడే ఓ విషయం దాగుంది. గూగుల్ నిత్యం మనల్ని ట్రాక్ చేస్తుండటంతో మన చరిత్ర అంతా కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని వెళ్లిపోతుంటాం. అయితే ఇక్కడే కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ అడ్రస్ చెప్పడంలో పలుమార్లు విఫలం అవుతోంది.
తాజాగా గూగుల్‌కు వ్యతిరేకంగా కోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. యూజర్ల లోకేషన్ సమాచారం వివరాలను గూగుల్ స్టోర్ చేస్తోందని, యూజర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదారి పట్టిస్తోందని కోర్టులో పిటీషన్ దాఖలైంది. విచారించిన కోర్టు సెటిల్మెంట్లో భాగంగా 93 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.7000 కోట్లకు పైన జరిమానా వేసింది.
కాలిఫోర్నియా అటార్నీ జనర రాబ్ బొంటా అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశాడు. లొకేషన్ డేటాపై గూగుల్ వినియోగదారులను మోసం చేసిందని ఆరోపణలు చేశారు. లొకేషన్ ఆఫ్ చేయడం ద్వారా వారి స్థానాన్ని ట్రాక్ చేయడం లేదని, తన లాభం కోసం యూజర్లను మోసం చేస్తోందని ఆరోపించారు. ఉదాహరణలతో సహా అటార్నీ జనరల్ కార్యాలయం వివరించింది. దీంతో గూగుల్ తప్పు ఉందని తేలింది.
ఆరోపణలు విన్న కోర్టు ఈ కేసుకు సంబంధించి పలు వివరాలను సేకరించింది. లొకేషన్ ట్రాకింగ్ ప్రాక్టీసులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరుచుతామని గూగుల్ తెలిపింది. ఈ విషయంలో గూగుల్ ప్రతినిధి జోస్ కస్టనెడా మాట్లాడుతూ..కోర్టు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపడుతామని తెలిపారు. డేటా రక్షణ నిబంధనలను ఉల్లంఘించమని హామీ ఇచ్చారు.