ట్విట్టర్ యూజర్లు త్వరలో నెలవారీ ఫీజులు చెల్లించాల్సిందే. ఈ విషయంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు.
ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ షాకిచ్చాడు. గత ఏడాది మస్క్ ట్విట్టర్‌ను తన సొంతం చేసుకున్నాడు. ఆయన టేకోవర్ చేసిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చాడు. తన సంస్థలో సమూల మార్పులు చేశారు. చివరికి ట్విట్టర్ పేరును కూడా ఎక్స్‌గా మార్చారు. ట్విట్టర్ లోగో పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను తెచ్చారు. ట్విట్టర్ ఆదాయం పెంచుకోవడం కోసం మరో కీలక నిర్ణయాన్ని మస్క్ తీసుకున్నారు.
ఇప్పటి వరకూ ఉచితంగా ఉన్న ట్వీట్ డెక్ సర్వీసులను పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. గతంలో బ్లూ టిక్ తీసుకొచ్చిన మస్క్..త్వరలోనే తమ యూజర్లందరి నుంచి నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రతి యూజర్ నుంచి ఎంతో కొంత ఫీజును వసూలు చేసుకోవడానికి మస్క్ ప్రతిపాదనలను తీసుకురానున్నారు. అయితే ఎంత ఫీజు ఉంటుందనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.