»22 Year Old Google Employee Loses Rs 67 Lakh After Investing In Crypto Calls It His Biggest Mistake
Google Techie: క్రిప్టోలో పెట్టుబడి పెట్టి రూ.67లక్షలు పోగొట్టుకున్న గూగుల్ ఉద్యోగి
యుక్తవయస్సు రాకముందే తల్లిదండ్రుల సహాయంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన 22 ఏళ్ల గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. క్రిప్టోలో పెట్టుబడి పెట్టి దాదాపు రూ.67 లక్షలు నష్టపోయానని వెల్లడించాడు.
Google Techie: యుక్తవయస్సు రాకముందే తల్లిదండ్రుల సహాయంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన 22 ఏళ్ల గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. క్రిప్టోలో పెట్టుబడి పెట్టి దాదాపు రూ.67 లక్షలు నష్టపోయానని వెల్లడించాడు. అతను అప్పుగా తీసుకున్న డబ్బుతో క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేశాడు. ఇది తన అతిపెద్ద ఆర్థిక తప్పిదమని కాలిఫోర్నియాకు చెందిన ఎతాన్ న్గున్లీ అన్నారు. నవంబర్ 2021 – జూన్ 2022 మధ్య క్రిప్టోలో రూ. 67 లక్షలు (సుమారు $80,000) కోల్పోయినట్లు న్గుయోన్లీ తెలిపారు.
అంత డబ్బు ఎలా పోగొట్టుకున్నాడో తెలీని టెక్కీ, బిట్‌కాయిన్, ఎథెరియంలో ఇప్పటికే దాదాపు రూ. 33 లక్షలు (40,000 డాలర్లు) పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. ఇది కాకుండా, షిబా ఇను, డోగ్కాయిన్లలో కొన్ని వందల డాలర్లు పెట్టుబడి పెట్టబడ్డాయి. అయితే, బిట్‌కాయిన్ ధర పడిపోవడంతో టెక్కీ అప్పుగా తీసుకున్న రూ.12 లక్షల (15,000 డాలర్లు) డబ్బుతో మరింత కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. బిట్‌కాయిన్ ధర ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయికి చేరుకోవడం వల్ల కొంత కాలానికి దీని ధర రూ. 42 లక్షలు ($50,000)గా మారింది. అయినప్పటికీ, క్రిప్టో మార్కెట్ 2021 చివరి నాటికి క్షీణించింది. 2022 వేసవి నాటికి బిట్‌కాయిన్ ధర 70 శాతానికి పైగా పడిపోయింది. భారీగా నష్టపోవడంతో తప్పనిసరిగా వాటిని ఏవరేజ్ చేసేందుకు తన దగ్గర లేకపోయినా కొంత డబ్బు కూడగట్టి పెట్టుబడి పెట్టానన్నాడు. క్రిప్టో మార్కెట్ తిరగబడిన తర్వాత తన నష్టాలు పెరిగినట్లు తెలిపాడు. అతను తన తప్పు నుండి నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఏమిటంటే, తన వద్ద ఉన్న డబ్బును మాత్రమే పెట్టుబడి పెట్టడం.. ఊహాజనిత పెట్టుబడులలో ఉపయోగించకూడదు.