»Indo Bangladesh Border West Bengal Bsf Jawan Seized 23 Kg Gold Biscuit Worth Of Rs 14 Crore
BSFSeizedGold: రూ.14 కోట్ల విలువైన 23 కిలోల బంగారం పట్టివేత
ఇండోబంగ్లాదేశ్ సరిహద్దులో గోల్డ్ స్మగ్లింగ్ ముఠాను BSF జవాన్లు చేధించారు. ఆ క్రమంలో ఇద్దరిని పట్టుకుని వారి నుంచి ఏకంగా 14 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి అక్రమంగా తరలిస్తున్న రూ.14 కోట్ల విలువైన 66 బంగారు బిస్కెట్లను BSF జవాన్లు పట్టుకున్నారు. ఆ క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 23 కిలోల పుత్తడిని స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు పశ్చిమ బెంగాల్లోని 24 పరగణా జిల్లా పరిధిలో వీరిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.