»Bsf 2 5 Kg Gold Seized India Bangladesh Border Dhaka To Kolkata
Gold seized: 2.5 కిలోల గోల్డ్ పట్టివేత
బీఎస్ఎఫ్ దళాలు మరోసారి పెద్ద ఎత్తున అక్రమంగా గోల్డ్ తరలిస్తున్న దుండగులను పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 2.5 కిలోల గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఇండో బోర్డర్ సరిహద్దు వద్ద చోటుచేసుకుంది.
bsf 2.5 kg gold seized india bangladesh border Dhaka to Kolkata
ఇండియాకు అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని బీఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1.6 కోట్ల రూపాయల విలువైన 16 బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 2.5 కిలోల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దుండగులు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోని కోల్‌కతాకు అంతర్జాతీయ బస్సులో అక్రమంగా సరుకులను తరలిస్తున్న క్రమంలో పట్టబడ్డారు.
అయితే ఆ వ్యక్తులు ఏ ప్రాంతానికి ఆ గోల్డ్ తరలిస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ అక్రమ రవాణా చేస్తున్నారు. వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా లేదా వీరే ఈ తంతంగానికి పాల్పడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు గతంలో కూడా బీఎస్ఎఫ్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. వారం క్రితం కూడా BSF 145 బెటాలియన్‌కు చెందిన అధికారుల బృందం మొత్తం 3,191.22 గ్రాముల బరువున్న 23 బంగారు బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు పశ్చిమ బెంగాల్లో నలుగురు బంగ్లాదేశ్ స్మగ్లర్లను పట్టుకున్నారు. నిందితుల దిగువ శరీరాల నుంచి బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. ఇవి బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా అవుతున్నాయని, వాటి విలువ రూ. 1.86 కోట్లు ఉంటుందని బీఎస్ఎఫ్ తెలిపింది.