Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి షేక్ హసీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం తమ అదృష్టమని తెలిపారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతీయులు తమకు అండగా ఉన్నారన్నారు. 1975 తర్వాత మా కుటుంబాన్ని మొత్తం కోల్పోయినప్పుడు మాకు ఆశ్రయమిచ్చారని తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజాస్వామ్యం ఎంతో కీలమని తెలిపారు. 2009 నుంచి 2023 వరకు తాము అధికారంలో ఉండటం వల్లే బంగ్లాదేశ్ ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటువేసే వాతావరణాన్ని కల్పించామని తెలిపారు.
#WATCH | Bangladesh Prime Minister Sheikh Hasina casts her vote in Dhaka as the country goes to general elections 2024 today. pic.twitter.com/T8tPAhXOmU
1975లో జరిగిన పోరులో హసీనా తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయారు. దీంతో ఆమె చాలా కాలంపాటు భారత్‌లో జీవించారు. తర్వాత ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లి.. అవామీ లీగ్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని 300 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగియనున్నది. 27 పార్టీలకు చెందిన 1500 మంది అభ్యర్థులతోపాటు 436 మంది స్వతంత్రలు బరిలో నిలిచారు. సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.