జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో స్పెయిన్‌కు చెందిన ఒక విదేశీయురాలిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భారతదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన ఓ విదేశీ మహిళపై దుండగులు అత్యాచారం చేశారు.
Spain: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో స్పెయిన్‌కు చెందిన ఒక విదేశీయురాలిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భారతదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన ఓ విదేశీ మహిళపై దారుణం జరిగింది. ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా పరిధిలో తన భర్తతో కలిసి ఓ తాత్కాలిక గుడారంలో ఉన్న స్పెయిన్ దేశస్థురాలిపై స్థానిక యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు శనివారం పోలీసులు తెలిపారు.
బంగ్లాదేశ్ నుంచి ద్విచక్ర వాహనంపై శుక్రవారం రాత్రి ఝార్ఖండ్‌కు చేరుకున్న ఈ జంట దుమ్కా వద్ద గుడారంలో బస చేసింది. వీరిని గమనించిన స్థానిక యువకులు జంటపై దాడి చేసి, మహిళపైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గాయాలతో రోడ్డుపై ఉన్న బాధితులను పోలీసులు గుర్తించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. ఏడుగురు లేదా ఎనిమిదిమంది అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బాధితురాలిని, ఆమె భర్తను ఆసుపత్రికి తరలించారు. దుమ్కా జిల్లా ఎస్పీని సస్పెండు చేయాలని డిమాండు చేసింది.