The last cabinet meeting of NDA in a while was BJP Prime Minister Narendra Modi
Cabinet meeting: ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో చివరి కేంద్ర మంత్రివర్గ సమావేశం కానుంది. దేశంలో లోక్ సభ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం. ఈ సమావేశంలో ప్రధాని తన మంత్రివర్గంలోని మంత్రులుకు వీడ్కోలు ఉపన్యాసం ఇవ్వనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని చాణక్యపురి డిప్లొమేటిక్ ఎన్‌క్లేవ్‌లోని సుష్మా స్వరాజ్ భవన్లో ఈ భేటీ జరగనుంది. ఇదే మీటింగ్‌లో ఎన్డీయే ప్రభుత్వం తదుపరి వ్యూహం ఏంటో, మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎలాంటి ప్రణాళికలు రచించాలో ప్రధాని చర్చించనున్నారు. గత పది సంవత్సరాలుగా అధికారంలోకి ఉన్న బీజేపీ మరో సారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నించే విధానాలపై ఇతర మంత్రుల సలహాలు, సూచనలు కూడా తీసుకోనే అవకాశం ఉంది.