Fan Speed : మీ ఫ్యాన్ వేగంగా తిరగడం లేదా? ఇలా చేయండి!
కొందరి ఇళ్లల్లో ఫ్యాన్లు నీరసంగా తిరుగుతూ ఉంటాయి. వాటి నుంచి తక్కువగా గాలి వస్తూ ఉంటుంది. అలాంటి ఫ్యాన్లను వేగంగా తిరిగేలా చేసే కొన్ని ప్రో టిప్స్ ఇక్కడున్నాయి. చదివేయండి.
how to increase fan speed : కొన్ని ఫ్యాన్లు కొన్నప్పటి నుంచే మెల్లిగా తిరుగుతుంటాయి. అలాగే మరి కొన్ని ప్యాన్లు కొన్ని రోజులు వేగంగా(Speed) తిరిగి తర్వాత మెల్ల మెల్లగా వేగం తగ్గించేస్తుంటాయి. బాగా గాలి వచ్చేలా తిరగకుండా నెమ్మదిగా మారిపోతాయి. ఈ సమస్యలకు నిపుణులు చెబుతున్న అద్దిరిపోయే ఐడియాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. చదివేసి అవసరం ఉన్నప్పుడు ప్రయత్నించేయండి.
కొన్ని ఫ్యాన్లు(Fans) ముందు బాగానే తిరుగుతుంటాయి. ఉన్నట్లుండి నెమ్మదిగా మారిపోతూ ఉంటాయి. అలాంటి వాటి ఫ్యాన్ రెక్కలకు ఎక్కువగా దుమ్ము పేరుకుపోయిందేమో చూడండి. ఒక పిల్లో కవర్‌లాంటి దాన్ని దానికి తొడిగేసి చక్కగా పైనా కిందా శుభ్రం చేసేయండి. ఇలా చేయడం వల్ల ఫ్యాన్ రెక్కలపై ఏర్పడిన దుమ్ము, బరువు తొలగిపోయి అది మళ్లీ వేగంగా తిరుగుతుంది. అది మీరే గమనిస్తారు. దీనితో పాటు ఫ్యాన్‌కు ల్యూబ్రికెంట్ ఆయిల్‌ని అప్పుడప్పుడూ అప్లై చేస్తూ ఉండండి.
కొన్ని ఫ్యాన్లు(Fans) మొదటి నుంచి మెల్లగానే తిరుగుతూ ఉంటాయి. అలాంటివి వేగంగా తిరగాలంటే దానిలోని కెపాసిటర్ని మార్చాల్సి ఉంటుంది. ప్యాన్ వేగానికి సంబంధించిన ఇబ్బందులన్నీ 90 శాతం కెపాసిటర్ వల్లనే వస్తూ ఉంటాయి. అలాగే పాత బేరింగులు ఉంటే మార్చివేయండి. ఎలక్ట్రీషియన్ సలహా మేరకు రెగ్యేలేటర్ పాడైపోతే కూడా సరిగ్గా ఫ్యాన్ వేగం ఉండదు. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని ఏం చేయాలో ఎలక్ట్రీషియన్ సహాయంతో నిర్ణయం తీసుకోండి.