»Fighting Lady Police With Fan In India Pakistan Match Viral Video
Viral video: భారత్-పాక్ మ్యాచులో లేడీ పోలీస్ ను కొట్టిన ప్రేక్షుకుడు
భారత్(india)-పాకిస్తాన్(Pakistan) మ్యాచ్ సందర్భంగా నిన్న మోడీ స్టేడియంలో ఓ మహిళా పోలీస్, ప్రేక్షకుడి మధ్య ఫైట్ జరిగింది. అయితే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ప్రేక్షకుడు ఏకంగా పోలీస్ అధికారిపై చేయి చేసుకున్నాడు. ఇది చూసిన పలువురు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి.
fighting lady police with fan in India Pakistan match Viral video
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శనివారం భారత్(bharat)-పాకిస్తాన్(Pakistan) మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచులో భాగంగా ఓ ఘర్షణ చోటుచేసుకుంది. ఓ మహిళా పోలీసు అధికారిణి, ప్రేక్షకుడికి మధ్య స్టేడియంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో అది కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో ఆ మహిళా పోలీసు అధికారి అతన్ని చెంపపై కొట్టింది. ఆ నేపథ్యంలోనే అతను కూడా ఆ మహిళాపై పోలీసుపై చేయి చేసుకున్నాడు. దీంతో పక్కనున్నవారు అతన్ని ఆపడంతో కాస్తా సద్దుమణిగినట్లు అనిపిచింది.
అయితే ఈ దృశ్యాలను అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీయగా..ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడయాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియో చూసిన
పలువురు అసలు ఏమైందని ప్రశ్నిస్తు కామెంట్లు చేస్తున్నారు. సదరు ప్రేక్షకుడు లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్ను రెచ్చగొట్టేలా కొన్ని అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడని పలువురు అంటున్నారు. మరోవైపు పోలీస్ అధికారిపై అలా చేయి చేసుకుంటారా అంటూ ఇంకొంతమంది అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక ఎంతో ఆసక్తిగా ఎదూరుచూసిన ICC పురుషుల ODI ప్రపంచ కప్ 2023లో భారత్ నిర్ణయాత్మక మ్యాచులో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. దేశంలోనే అతిపెద్ద స్టేడియమైన మోడీ మైదానంలో 1,32,000 మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు.