అరకొరగా ఒక్కో రోజు తగ్గుతూ ఉన్నా దేశంలో క్రమంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం కూడా పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. దేని ధర ఎంతుందంటే..?
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఆదివారం రూ.74,700 ఉండగా, సోమవారం నాటికి రూ.248 పెరిగి రూ.74,948కి చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,948గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) ఆదివారం రూ.85,588 ఉండగా, సోమవారం నాటికి రూ.571 పెరిగి రూ.86,159కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ గోల్డ్, వెండి ధరలు పెరిగాయి. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,344 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 15 డాలర్లు పెరిగి 2,359కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.25 డాలర్లుగా ఉంది.