ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీకి భారత్ వెళ్లడం కష్టంగా మారడంతో BCCI ముందు పీసీబీ ఓ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. భారత్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఢిల్లీ వెళ్లిపోయేలా ప్రతిపాదన చేసిందట. అయితే BCCI దానిని తిరస్కరించిందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. పాక్ వెళ్లాలా వద్దా అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని BCCI వెల్లడించిందని సమాచారం.