GNTR: మంగళగిరి పట్టణంలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 22వ తేదీన డ్రోన్ సమ్మిట్ సదస్సు జరగనుంది. సుమారు 5,500 డ్రోన్లతో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద డ్రోన్ ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబు, డ్రోన్ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు.