ATP: గుత్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సచివాల సిబ్బందితో ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో శానిటేషన్ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు చురుగ్గా పాల్గొనాలని పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.