న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. అయితే కివీస్ మెరుగ్గా రాణించటానికి ఇద్దరు కీలక పాత్ర పోషించారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘భారత్ తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు గెలుస్తామనే ఆశ ఉండేది. కానీ రచిన్ రవీంద్రకు తోడుగా టిమ్ సౌథీ 8వ వికెట్కు 137 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యమే టీమిండియా ఓటమికి కారణమైంది’ అని అన్నారు.