AKP: మాడుగుల మండలం శంకరం పంచాయతీ ఉరకగెడ్డ ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే ఆర్ఆర్ ప్యాకేజీ ద్వారా పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న డిమాండ్ చేశారు. సోమవారం ఉరకగెడ్డ ప్రాజెక్టు పరిశీలించి మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణం జరిగినప్పుడు గిరిజన కుటుంబాలకు ప్యాకేజీ మంజూరు చేస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు.