VSP: స్వర్ణాంధ్ర విజన్-2024 పై విశాఖ జిల్లా స్థాయిలో గత నెల 30న విద్యార్థులకు డీఈవో కార్యాలయంలో నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వం డిబేట్ పలువురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. విజేతలైన విద్యార్థులకు విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సర్టిఫికెట్స్ మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు.